Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవకాశం వస్తే మళ్లీ మిలిందానే పెళ్లాడతా: బిల్‌గేట్స్ మనసులో మాట

Bill Gates Says He Would Choose To Marry Ex Wife Melinda
  • గతేడాది విడాకులు తీసుకున్న బిల్ గేట్స్-మిలిందా
  • విడిపోయినా ఫౌండేషన్‌ను కలిసే నిర్వహిస్తున్న వైనం
  • తన జీవితంలో జరిగిన అతిపెద్ద మార్పు విడాకులేనన్న గేట్స్
  • తన దృష్టిలో తమది గొప్ప వివాహమని అభివర్ణన
బిల్ గేట్స్-మిలిందాలు మళ్లీ ఒక్కటవుతారా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు తనకు మళ్లీ అవకాశం వస్తే కనుక మాజీ భార్య మిలిందానే పెళ్లాడతానని చెప్పడం గమనార్హం. మూడు దశాబ్దాల తమ వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ గతేడాది బిల్-మిలిందాలు విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ ఇద్దరూ కలిసే బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు జెన్నెర్, రోరీ, ఫోయెబ్  అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

తాజాగా ‘సండే టైమ్స్’తో మాట్లాడిన గేట్స్.. గత రెండేళ్లు ఎలా గడిచిందీ వివరించారు. ఈ కాలంలో తన జీవితంలో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్టు చెప్పారు. పిల్లలు పెద్దవారై కుటుంబాన్ని విడిచి వెళ్లాక వివాహ బంధంలో మార్పు వస్తుందని, కానీ తన జీవితంలో జరిగిన అతిపెద్ద మార్పు మాత్రం విడాకులేనని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. తన దృష్టిలో తమది గొప్ప వివాహమని పేర్కొన్నారు. అయితే, జరిగిపోయిన దానిని మార్చలేమన్నారు. 

తాను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని, అవకాశమంటూ వస్తే మిలిందానే మళ్లీ పెళ్లాడతానని చెప్పుకొచ్చారు. విడిపోయినా ఆమెతో కలిసి పనిచేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తమ మధ్య అత్యంత సన్నిహిత సంబంధం ఉందన్నారు. భవిష్యత్ పరంగా తనకు ఎలాంటి ప్రణాళికలు లేవని అయితే, మిలిందాను మళ్లీ పెళ్లాడడం గురించి మాత్రం ఆలోచిస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా గేట్స్ చెప్పుకొచ్చారు.
Bill Gates
Melinda Gates
Microsoft
Marriage

More Telugu News